మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం: ఏపీ మంత్రి బొత్స
- పాలనా వికేంద్రకీరణకే మా ఓటు
- మా పార్టీ అధినేత ఆలోచనే మాకు శిరోధార్యం
- టీడీపీ నేతల మాటలను పట్టించుకోబోం
- శివరామకృష్ణన్ కమిటీ నివేదికను టీడీపీ ఎందుకు పట్టించుకోలేదన్న బొత్స
ఇప్పటికీ తమ ప్రభుత్వం మూడు రాజదానులకే కట్టుబడి ఉందని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. పాలనా వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చెందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని కూడా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ నిర్మించాలనే విషయంపై కేంద్రం నియమించిన జస్టిస్ శివరామకృష్ణన్ కమిటీ కూడా పాలనా వికేంద్రీకరణను ప్రస్తావించిందని మంత్రి చెప్పారు.
నాడు అధికారంలో ఉన్న టీడీపీ శివరామకృష్ణన్ కమిటీ సిఫారసులను ఎందుకు పట్టించుకోలేదని కూడా ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధినేత ఆలోచనలే తమకు శిరోధార్యం అని చెప్పిన మంత్రి.. టీడీపీ నేతలు చెప్పిన మాటలను తాము పెద్దగా పట్టించుకోబోమన్నారు.