మొత్తానికి జెనీలియా రీ ఎంట్రీ ఇస్తోంది!
- తెలుగులో జెనీలియాకి మంచి క్రేజ్
- చెప్పుకోదగిన చిత్రంగా 'బొమ్మరిల్లు'
- పదేళ్ల తరువాత రీ ఎంట్రీ
- కిరీటి సినిమాలో కీలక పాత్ర
తెలుగులో జెనీలియా చేసిన సినిమాల్లో 'సై' .. 'హ్యాపీ' .. 'బొమ్మరిల్లు' భారీ విజయాలను అందుకున్నాయి. 'బొమ్మరిల్లు'లో హాసిని పాత్రను ప్రేక్షకులు ఇప్పటికీ మరిచిపోలేదు. అంతగా ఆమె ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేసింది. వివాహమైన తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. పదేళ్ల తరువాత రీ ఎంట్రీ ఇస్తోంది.
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వారాహి వారు నిర్మిస్తున్నారు. కన్నడ .. తెలుగు భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా నిన్ననే రాజమౌళి క్లాప్ తో మొదలైంది. శ్రీలీల కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో జెనీలియా కీలకమైన పాత్రను పోషిస్తోంది. ఆమె అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి.