'ఆడవాళ్లు మీకు జోహార్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ .. ముఖ్య అతిథులు వీరే!
- కిశోర్ తిరుమల నుంచి 'ఆడవాళ్లు మీకు జోహార్లు'
- ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో నడిచే కథ
- ఈ నెల 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- మార్చి 4వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 27వ తేదీన, హైదరాబాద్ .. శిల్పకళావేదికలో నిర్వహిస్తున్నారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలవుతుంది. ముఖ్య అతిథులుగా దర్శకుడు సుకుమార్ .. స్టార్ హీరోయిన్స్ కీర్తి సురేశ్ - సాయిపల్లవి హాజరు కానున్నారు.
ఈ వేడుకపై కీర్తి సురేశ్ - సాయిపల్లవి ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా అధికారిక పోస్టర్ ను వదిలారు. రాధిక .. ఖుష్బూ .. ఊర్వశి వంటి సీనియర్ నటీమణులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ శర్వానంద్ కి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
