bheemla naik: ప‌వ‌న్‌తో క‌లిసి డ్ర‌మ్స్ వాయించిన‌ కేటీఆర్‌

KTR playing drums with Pawan kalyan

  • హైదరాబాదులో భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ వేడుక 
  • ముఖ్య అతిథిగా హాజ‌రైన మంత్రి కేటీఆర్‌
  • ప‌వ‌న్‌తో క‌లిసి సంద‌డి చేసిన తెలంగాణ మంత్రి

టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓ ఆస‌క్తిక‌ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. హైద‌రాబాద్‌లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో అట్ట‌హాసంగా జ‌రుగుతున్న ఈ వేడుక‌కు ముఖ్య అతిధిగా టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావు హాజ‌ర‌య్యారు.

ప‌వ‌న్ తో క‌లిసి వేదిక ఎక్కిన కేటీఆర్ ఉత్సాహంగా క‌నిపించారు. అప్ప‌టిదాకా ప‌వ‌న్‌తోనే క‌లిసి కూర్చున్న కేటీఆర్ వేదిక ఎక్క‌గానే ఒక్క‌సారిగా హుషారుగా క‌నిపించారు. ప‌వ‌న్‌తో క‌లిసి డ్ర‌మ్స్ వాయిస్తూ సంద‌డి చేశారు. ఈ దృశ్యం అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

bheemla naik
Pawan Kalyan
power star
KTR
  • Loading...

More Telugu News