కేంద్ర సర్వీసులకు ఏపీ ఐఏఎస్ శ్రీకాంత్
- సీఆర్డీఏ తొలి కమిషనర్‌గా మంచి గుర్తింపు
- ప్రస్తుతం ఏపీ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు
- సెంట్రల్ కేబినెట్ సెక్రటేరియట్‌లో కొత్త పోస్టింగ్
- ఐదేళ్ల పాటు అదే పోస్టులో కొనసాగనున్న శ్రీకాంత్
కేంద్ర సర్వీసులకు వెళ్లనున్న శ్రీకాంత్‌కు ఇప్పటికే పోస్టింగ్ కూడా ఖరారైంది. ఏపీ నుంచి రిలీవ్ అయి ఢిల్లీకి వెళ్లిన వెంటనే ఆయన సెంట్రల్ కేబినెట్ సెక్రటేరియట్‌లో జాయింట్ సెక్రటరీగా విధుల్లో చేరిపోనున్నారు. ఈ పోస్టులో ఆయన ఐదేళ్ల పాటు కొనసాగనున్నట్లుగా సమాచారం.