అబాట్ పిల్లల ఆహార ఉత్పత్తులను వాడొద్దు.. చైనా హెచ్చరిక
- ఈ కామర్స్ మార్గాల్లో తెప్పించుకోవద్దు
- యూఎస్ ఎఫ్ డీఏ సైతం ఇదే సూచన
- సిమిలాక్ లో నాణ్యత లేమి
- మిచిగాన్ కేంద్రంలో తయారైన వాటిని వెనక్కి తీసుకుంటున్న కంపెనీ
ఈ కామర్స్ పోర్టళ్ల ద్వారా ఇతర దేశాల నుంచి తెప్పించుకునే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ హెచ్చరిక చేసింది. అబాట్ కు చెందిన కొన్ని బేబీ ఫార్ములా ఉత్పత్తులను వినియోగించొద్దంటూ యూఎస్ఎఫ్ డీఏ సైతం ఈ నెల 18న జారీ చేసిన హెచ్చరికను చైనా కస్టమ్స్ విభాగం గుర్తు చేసింది.
మిచిగాన్ కేంద్రంలో తయారైన సిమిలాక్ (తల్లి పాలకు బదులుగా ఇచ్చే పాలపొడి) ఉత్పత్తులను వెనక్కి తీసుకుంటున్నట్టు అబాట్ ఈ నెల 17న ఓ ప్రకటన చేసింది. వీటిలో నాణ్యత లోపించడమే ఈ చర్యకు కారణం.