ఏపీ కొత్త డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
- గౌతమ్ సవాంగ్ స్థానంలో డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి
- తనపై సీఐడీ అధికారులు దాడి చేశారన్న రఘురామ
- వారిలో సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ ఉన్నాడని వెల్లడి
- దర్యాప్తు వేగవంతం చేయాలని విజ్ఞప్తి
ఈ ఘటనపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా నివేదిక కోరినా అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించలేదని రఘురామ ఆరోపించారు. లోక్ సభ స్పీకర్ కోరిన మేరకు నివేదికను త్వరగా పంపాలని విజ్ఞప్తి చేశారు. పోలీసు వ్యవస్థపై మళ్లీ విశ్వాసం కలిగేలా చర్యలు తీసుకోవాలని, నిష్పక్షపాత రీతిలో దర్యాప్తు జరపాలని కోరారు.