సనాతన ధర్మాన్ని కాపాడేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషి హర్షణీయం: సత్య గౌర చంద్రదాస్
- తాడేపల్లి మండలంలో గోకుల క్షేత్రం
- భూమి కేటాయించిన సీఎం జగన్
- రేపు ప్రారంభోత్సవం
- హాజరుకానున్న ఏపీ సీఎం
గోకుల క్షేత్ర ఏర్పాటుకు సీఎం జగన్ భూమి కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ గోకుల క్షేత్ర నిర్మాణానికి రేపు శంకుస్థాపన జరగనుందని వెల్లడించారు. సీఎం జగన్ సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు తనవంతు కృషి చేస్తున్నారని సత్య గౌర చంద్రదాస్ కొనియాడారు. కాగా, గోకుల క్షేత్ర నిర్మాణం ప్రారంభోత్సవంలో సీఎం జగన్ కూడా పాల్గొంటారని ఆయన వెల్లడించారు.