సినీ ఇండస్ట్రీకి పెద్దన్న మోహన్ బాబు: నరేశ్
- మోహన్ బాబు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు
- అందరి కంటే మిన్న మోహన్ బాబు
- సినిమా కోసమే పుట్టిన వ్యక్తి మోహన్ బాబు
తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప హీరోలున్నారని, గొప్ప విలన్లు ఉన్నారని, గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారని... కానీ అన్నీ కలిసిన ఒకే ఒక వ్యక్తి మోహన్ బాబు అని నరేశ్ కొనియాడారు. ఆయనకు ఆయనే సాటి అని అన్నారు. రైతు కుటుంబంలో జన్మించి, ఉపాధ్యాయుడిగా ఎదిగి, యూనివర్శిటీ స్థాపించే స్థాయికి చేరుకున్న ఏకైక నటుడు మోహన్ బాబు అని కితాబునిచ్చారు. మోహన్ బాబు సినిమా కోసం బతికే వ్యక్తి కాదని, సినిమా కోసం పుట్టిన వ్యక్తి అని అన్నారు.