సర్కారు వారి పాట నుంచి 'కళావతి' సాంగ్... మహేశ్ బాబు అభిమానులకు వాలెంటైన్స్ డే కానుక
- పరశురాం దర్శకత్వంలో మహేశ్ బాబు
- మే 12న రిలీజవుతున్న సర్కారు వారి పాట
- ప్రేమికుల రోజున తొలిపాట విడుదల
- బాణీలు అందించిన తమన్
మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి.