అందుకే 'రాధేశ్యామ్'కి డబ్బులు తీసుకోలేదు: తమన్
- 'రాధే శ్యామ్'పై స్పందించిన తమన్
- ఇది నా స్థాయిని మించిన సినిమా
- యూవీ చేసిన సాయాన్ని మరిచిపోలేను
- మార్చి 11న విడుదలవుతున్న సినిమా
"ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని యూవీ క్రియేషన్స్ వారు నన్ను అడిగారు. నిజానికి ఈ సినిమా స్థాయికి నేను సరిపోను. అయినా నా పట్ల గల నమ్మకంతో వారు ఈ ప్రాజెక్టును అప్పగించారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నేను అనుకుంటున్నాను. ఈ సినిమాకి పనిచేస్తున్నప్పుడు నేను మరో ప్రపంచంలోకి వెళ్లిపోయాను.
ఇది పాన్ ఇండియా సినిమా అనే విషయం అందరికీ తెలిసిందే. అయినా నేను ఈ సినిమాకి పని చేసినందుకు పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నా చేతిలో సినిమాలు లేనప్పుడు, యూవీ వారు 'మహానుభావుడు' .. 'భాగమతి' ప్రాజెక్టులను ఇచ్చి నాకు ఎంతో హెల్ప్ చేశారు. ఆ కృతజ్ఞత వల్లనే నేను డబ్బులు తీసుకోలేదు" అని చెప్పుకొచ్చారు.