ఈరోజు హైదరాబాదుకు వస్తున్న జగన్.. షెడ్యూల్ వివరాలు ఇవిగో!
- శ్రీ రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్న జగన్
- సాయంత్రం 5 నుంచి 7.30 గంటల వరకు ఆశ్రమంలో గడపనున్న సీఎం
- రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి పయనం
అక్కడి నుంచి ముచ్చింతల్ లోని త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశ్రమానికి వెళ్లి సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు ఆయన అక్కడే ఉంటారు. అనంతరం రాత్రి 8 గంటలకు తిరిగి తాడేపల్లికి బయల్దేరి, రాత్రి 9.05 గంటలకు చేరుకుంటారు.
కాగా, 216 అడుగుల ఎత్తైన శ్రీ రామానుజుల విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న ఆశ్రమాన్ని సందర్శించారు. సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు.