వివేకానందరెడ్డి హత్య కేసు.. సీబీఐ చార్జ్‌షీట్‌లో ఐదో నిందితుడిగా శివశంకర్‌రెడ్డి
- గతేడాది నవంబర్ 17న హైదరాబాద్‌లో అదుపులోకి
- ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో శివశంకర్‌రెడ్డి
- పులివెందుల కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు
అప్పటి నుంచి ఆయన కడప సెంట్రల్ జైలులోనే ఉంటున్నారు. ఈ కేసులో సీబీఐ తాజాగా దాఖలు చేసినది రెండో చార్జ్‌షీట్ కాగా, తుది చార్జ్‌షీట్‌ను దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసులో అరెస్ట్ అయిన వివేకా డ్రైవర్ షేక్ దస్తగిరి ఆ తర్వాత అప్రూవర్‌గా మారి సంచలన విషయాలు వెల్లడించాడు. ఆయనిచ్చిన సమాచారం ఆధారంగానే శివశంకర్‌రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది.