Chiranjeevi: 'గాడ్ ఫాదర్' షూటింగులో నయన్!

God Father movie upadate

  • తమిళ సినిమాలతో నయన్ ఫుల్ బిజీ
  • 'గాడ్ ఫాదర్'కి గ్రీన్ సిగ్నల్
  • హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
  • తాజాగా జాయినైన నయన్    

తమిళనాట నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇక తెలుగులోనూ ఆమెకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ మధ్య సొంత ప్రొడక్షన్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆమె మరింత బిజీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే 'గాడ్ ఫాదర్' సినిమా కోసం ఆమెను అడిగారు. అయితే ఇందులో ఆమెను హీరోకి చెల్లెలి పాత్ర కోసం సంప్రదించారు.

'సైరా' సినిమాలో తన పాత్ర నిడివిని తగ్గించారని అలిగిన నయన్ ఈ సినిమా చేయకపోవచ్చనీ, చెల్లెలి పాత్రకి ఒప్పుకోకపోవచ్చని అంతా అనుకున్నారు. కానీ నయనతార ఆ పాత్రకి గల ప్రాధాన్యత కారణంగా అంగీకరించారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగు రీసెంట్ గా మొదలైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగు జరుగుతోంది.

కరోనా బారినపడిన కారణంగా చిరంజీవి ఈ షెడ్యూల్లో ఇంకా జాయిన్ కాలేదు. ప్రస్తుతం నయనతారకి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇక్కడే మరో పది రోజుల పాటు ఆమెకి సంబంధించిన చిత్రీకరణ జరుగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News