అభిమానులకు గుడ్ న్యూస్.. 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ ఖరారు!
- ఆసక్తిని రేపుతున్న 'ఆర్ ఆర్ ఆర్'
- భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో నిర్మాణం
- సంగీత దర్శకుడిగా కీరవాణి
- మార్చి 25వ తేదీన రిలీజ్
ఈ నేపథ్యంలో మార్చి 18వ తేదీనగానీ .. ఏప్రిల్ 28వ తేదీనగాని ఈ సినిమాను విడుదల చేయనున్నారనే టాక్ వినిపించింది. అయితే ఊహించిన దానికంటే ముందుగానే కరోనా తీవ్రత తగ్గుతూ ఉండటంతో మార్చి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కొంతసేపటి క్రితం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.
డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇటు దక్షిణాది .. అటు ఉత్తరాదికి చెందిన చాలామంది ఆర్టిస్టులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతో రాజమౌళి మరో సంచలనానికి తెరతీయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.