Renu Desai: రవితేజ సినిమాలో రేణు దేశాయ్?

Renu Desai to act in Raviteja movie

  • రవితేజ హీరోగా తెరకెక్కుతున్న 'టైగర్ నాగేశ్వరరావు'
  • రవితేజ సోదరి పాత్రలో రేణు నటించబోతున్నట్టు వార్తలు
  • 'జానీ' చిత్రంలో చివరిసారి నటించిన రేణు దేశాయ్

టాలీవుడ్ లో ఓ ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. జనసేనాని మాజీ భార్య రేణు దేశాయ్ వెండి తెరపై తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టబోతున్నారనేదే ఆ వార్త. 'జానీ' సినిమా తర్వాత రేణు మళ్లీ సినిమాల్లో నటించలేదు. ఇప్పుడు ఆమె రవితేజ హీరోగా నటిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లో కీలక పాత్ర పోషించబోతున్నారని తెలుస్తోంది.

ఇందులో రవితేజ సోదరి పాత్రలో ఆమె నటించనున్నట్టు సమాచారం. ఈ పాత్ర విషయమై ఇప్పటికే ఆమెతో చర్చలు జరుగుతున్నాయని చెపుతున్నారు. ఈ సినిమాకు వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కెరీర్లో ఈ సినిమా తొలి పాన్ ఇండియా చిత్రం కాబోతోంది. దీంతో ఈ సినిమాకు తగ్గట్టుగానే క్యాస్టింగ్ ను ఎంపిక చేస్తున్నారు. ఈ వార్తల ప్రకారం రేణు దేశాయ్ ఈ చిత్రంలో నటిస్తే... కచ్చితంగా సెన్సేషన్ అవుతుంది.

  • Loading...

More Telugu News