రామ్ చరణ్ భార్య ఉపాసన పోస్ట్ చేసిన ఫొటో చూసి మండిపడుతోన్న నెటిజన్లు
- గుడి గోపురం ఫొటో పోస్ట్
- మనుషులతో రూపొందించిన ఫొటో
- తాను, చెర్రీ కూడా ఉన్నామన్న ఉపాసన
అయితే, కొంతమంది ప్రజల విగ్రహాలు ఆ గోపురానికి ఉన్నట్లు ఆ ఫొటో ఉంది. అంతేగాక, ఆ ఫొటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నాడంటూ ఉపాసన పేర్కొన్నారు. ఆ ఫొటోలో తాము ఎక‍్కడ ఉన్నామో కనిపెట్టాలని ఆమె కోరింది.
అయితే, దేవుళ్ల విగ్రహాలు ఉండాల్సిన గోపురంపై మనుషులు ఉన్నట్లు ఫొటో రూపొందించడం ఏంటంటూ నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఆమె ఫొటో, వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు.