అభిమానులకు తీపి కబురు చెప్పిన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా.. సరోగసీ ద్వారా బిడ్డకు జన్మ!
- తమకు బిడ్డ పుట్టిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్
- చెప్పలేనంత సంతోషంగా ఉందన్న ప్రియాంక
- ఈ ప్రత్యేక సమయంలో ప్రైవసీకి భంగం కలిగించొద్దని ప్రేమపూర్వక వేడుకోలు
ఇటీవలే 39వ పడిలో పడిన ప్రియాంక చోప్రా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పిల్లలు కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. భవిష్యత్తులో పిల్లలు తమ జీవితంలో పెద్ద భాగం అవుతారని అన్నారు. దేవుని దయతో అది అయినప్పుడే అవుతుందని అన్నారు. అయితే, ఆ సమయం ఇంత త్వరగా వస్తుందని అభిమానులు ఊహించలేకపోయారు.