రష్మిక రిలీజ్ చేసిన 'స్టాండప్ రాహుల్' సాంగ్ .. చూసేయండి!
- రాజ్ తరుణ్ హీరోగా 'స్టాండప్ రాహుల్'
- కథానాయికగా వర్ష బొల్లమ్మ
- దర్శకుడిగా శాంటో పరిచయం
- సంగీత దర్శకుడిగా శ్వీకర్ అగస్తి
'పదా పదమంటోంది పసిప్రాయం .. సదా నిను చేరేటి ఆరాటం .. ఆగే వీల్లేదు కదా' అంటూ ఈ పాట సాగుతోంది. శ్వీకర్ అగస్తి స్వరపరిచిన ఈ పాటకి, రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా .. యాసిన్ నజీర్ ఆలపించాడు. నాయకా నాయికల మధ్య చిగురించిన ప్రేమ భావాల నేపథ్యంలో ఈ పాట సాగుతోంది.
ప్రతి అనుభవం .. అనుభూతిగా మారుతుంటే, మనసు అరలలో వాటిని పదిలపరచుకుంటూ ఈ ప్రేమికులు ముందుకు సాగుతుంటారు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న రాజ్ తరుణ్ కి, ఈ సినిమా ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.