కరోనా కేసులు భారీగా ఉన్నా.. ఆంక్షలు విధించం: దక్షిణాఫ్రికా
- ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది
- జీవనోపాధి లభించడం కూడా కష్టమవుతుంది
- ప్రజలు ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలరన్న దక్షిణాఫ్రికా
వీటన్నిటి నేపథ్యంలో కోవిడ్ 19 ఆంక్షలను గుడ్డిగా అమలు చేయలేమని స్పష్టం చేసింది. ఒమిక్రాన్ కు ముందు వచ్చిన వైరస్ ల ద్వారా ప్రజలు వ్యాధి నిరోధకశక్తిని పెంచుకున్నారని... ఇప్పుడు వారు ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలరని తెలిపింది. ఇదిలావుంచితే, దక్షిణాఫ్రికాలో ప్రస్తుతం కరోనా కేసులు అధికంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కూడా సౌతాఫ్రికాలోనే పుట్టింది.