Galla Ashok: చరణ్ ముఖ్య అతిథిగా 'హీరో' ప్రీ రిలీజ్ ఈవెంట్!

Hero Pre Release Event on 13th Jan

  • 'హీరో'గా గల్లా అశోక్ పరిచయం 
  • శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం 
  • కథానాయికగా నిధి అగర్వాల్
  • ఈ నెల 15వ తేదీన విడుదల

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు తరువాత మరో హీరో వస్తున్నాడు. కృష్ణ పెద్ద కూతురు తనయుడు గల్లా అశోక్ 'హీరో' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతున్నాడు. మొదటి సినిమాతోనే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని మరీ రంగంలోకి దిగుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ఈ నెల 15న థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు జరుగుతున్నాయి. రేపు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ వేడుకకి చీఫ్ గెస్టుగా చరణ్ రానున్నట్టుగా తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. మహేశ్ మేనల్లుడి ఫంక్షన్ కి చరణ్ వస్తుండటం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించే అంశం.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, అశోక్ జోడీగా నిధి అగర్వాల్ సందడి చేయనుంది. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనీ, ఇది పక్కా పండుగ సినిమా అని ప్రమోషన్స్ లో చెబుతూ వస్తున్నారు. మరి చాలా కసరత్తు తరువాత రంగంలోకి దిగుతున్న అశోక్ కి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందనేది చూడాలి.

Galla Ashok
Nidhi Agarwal
Sriram Adithya
Hero Movie
  • Loading...

More Telugu News