తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బాలకృష్ణ సమావేశం
- హరీశ్ రావును కలిసిన బాలకృష్ణ
- బసవతారకం ఆసుపత్రి సేవలపై చర్చ
- ప్రభుత్వ మద్దతు అవసరమన్న బాలకృష్ణ
- సానుకూలంగా స్పందించిన హరీశ్ రావు
ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించి అనేక సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. ప్రభుత్వం నుంచి మద్దతు అవసరమని విజ్ఞప్తి చేశానని, గౌరవనీయ మంత్రి హరీశ్ రావు ఎంతో సానుకూలంగా స్పందించారని బాలకృష్ణ తెలిపారు. ఈ సమావేశంలో తనతో పాటు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి సీఈఓ డాక్టర్ ఆర్వీ ప్రభాకర్ రావు కూడా పాల్గొన్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.