రాజమౌళి చేతుల మీదుగా ఈ సాయంత్రం 'హీరో' ట్రైలర్ లాంచ్!
- 'హీరో'గా అశోక్ గల్లా
- దర్శకుడిగా శ్రీరామ్ ఆదిత్య
- సంగీత దర్శకుడిగా గిబ్రాన్
- ఈ నెల 15వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తిరుపతిలో నిన్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక జరపాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే రమేశ్ బాబు హఠాన్మరణం కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. ఈ రోజున సాయంత్రం 4:05 నిమిషాలకు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ ను లాంచ్ చేయిస్తున్నారు.
అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కొంతసేపటి క్రితం వదిలారు. సినిమా హీరో కావాలనే ఒక పట్టుదలతో, ఒక మధ్యతరగతి కుర్రాడు ఏం చేశాడు? అనేదే ఈ సినిమా కథ. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిచిన ఈ సినిమాకి గిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చాడు. నిధి అగర్వాల్ కథానాయికగా కనువిందు చేయనుంది.
.