ఫైట్ మాస్టర్స్ దర్శకత్వంలో లారెన్స్!
- డాన్స్ మాస్టర్ గా లారెన్స్ కి క్రేజ్
- డైరెక్టర్ గాను మంచి ఇమేజ్
- మరో హారర్ థ్రిల్లర్ గా 'దుర్గ'
- దర్శకులుగా అన్బు అరివుకి ఛాన్స్
ఆయన దర్శకత్వంలో వచ్చిన 'కాంచన' .. 'గంగ' సినిమాలు, తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టాయి. ఇప్పటికీ టీవీలో ఆ సినిమాలకు మంచి రేటింగ్ వస్తుంటుంది. అలాంటి లారెన్స్ ఆ మధ్య తన నుంచి 'దుర్గ' సినిమా వస్తున్నట్టుగా ప్రకటించాడు .. ఫస్టులుక్ తోనే భయపెట్టేశాడు. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది.
తాజా సమాచారం ఏమిటంటే, ఈ సినిమాకి లారెన్స్ దర్శకత్వం చేయడం లేదు .. నిర్మాతగా మాత్రమే ఉంటున్నాడు. 'కబాలి' .. 'కేజీఎఫ్' సినిమాలతో ఫైట్ మాస్టర్స్ గా పేరు తెచ్చుకున్న అన్బు - అరివు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారట. ఈ ఏడాదిలోనే ఈ హారర్ మూవీ ప్రేక్షకులను పలకరించనుందని అంటున్నారు.