కొరటాలను తొందర పెట్టేస్తున్న ఎన్టీఆర్!
- 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ వాయిదా
- కొరటాల సినిమాపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్
- త్వరలోనే సెట్స్ పైకి
- తదుపరి ప్రాజెక్టు బుచ్చిబాబుతో
ఈ నేపథ్యంలో ఇక తదుపరి సినిమాలను చకచకా పూర్తి చేయాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ కొరటాల శివతో ఉండనుంది. జనవరి 7న 'ఆర్ ఆర్ ఆర్' .. ఫిబ్రవరి 4వ తేదీన 'ఆచార్య' విడుదల కాగానే ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళదామని అనుకున్నారు.
కానీ సాధ్యమైనంత త్వరలో రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టేలా ప్లాన్ చేయమని కొరటాలకి ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే ఏడాదిలో బుచ్చిబాబుతో కూడా మరో సినిమా చేసి, ఏడాది చివరిలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును మొదలుపెట్టాలని ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.