'అతిథి దేవో భవ' ట్రైలర్ రిలీజ్!
- తెరపైకి మరో ప్రేమకథా చిత్రం
- కథానాయికగా నువేక్ష పరిచయం
- సంగీత దర్శకుడిగా శేఖర్ చంద్ర
- ఈ నెల 7వ తేదీన విడుదల
శేఖర్ చంద్ర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. హీరో నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ తో కూడిన సీన్స్ పై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. ప్రేమ .. అలకలు .. ఆపై గొడవలు .. అపార్థాలు తొలగిపోవడం ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి.
ఈ నెల 7వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో నువేక్ష కథానాయికగా పరిచయమవుతోంది. కొంతకాలంగా ఆది సాయికుమార్ సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయన నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి. ముఖ్యమైన పాత్రల్లో రోహిణి .. సప్తగిరి కనిపిస్తున్నారు.