18 ఏళ్లు నిండిన ప్రజలందరికీ కరోనా రెండు డోసులు వేసిన ఏకైక రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్
- దేశవ్యాప్తంగా 90 శాతం మంది వయోజనులకు రెండు డోసులు
- 64 శాతం మందికి ఒక్క డోసు
- నెరవేరని కేంద్ర సర్కారు లక్ష్యం
145 కోట్ల టీకాలను ప్రజలకు ఇవ్వగా.. రాష్ట్రాల వద్ద శుక్రవారం నాటికి 16.9 కోట్ల టీకా డోసులు మిగిలి ఉన్నాయి. సిరమ్ ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ టీకా 128.9 కోట్ల డోసులను సరఫరా చేసింది. కోవాగ్జిన్ 15.7 కోట్ల టీకా డోసులను అందించింది. మిగిలినవి స్పుత్నిక్ టీకాలు.
ఈ నెల 3 నుంచి 12 ఏళ్లు నిండిన పిల్లలకు కూడా టీకాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్, క్యాడిలాకు చెందిన జైకోవ్ డీ, సిరమ్ ఇనిస్టిట్యూట్ కు చెందిన కోవోవ్యాక్స్ లకు ప్రభుత్వం అనుమతించింది. ముందుగా భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాలే చిన్నారులకు అందుబాటులోకి రానున్నాయి. వృద్ధులు, ఆరోగ్య సమస్యలున్న వారికి త్వరలో మూడో టీకా డోసు (బూస్టర్ డోసు) కూడా రానుంది.