'శ్యామ్ సింగ రాయ్' నుంచి సిరివెన్నెల సాంగ్!
- 'శ్యామ్ సింగ రాయ్' గా నాని
- డిఫరెంట్ లుక్ తో సాయిపల్లవి
- ఫస్టు వీక్ లో మంచి వసూళ్లు
- సంగీత దర్శకుడిగా మిక్కీ జె మేయర్
ఈ సినిమా కోసం సిరివెన్నెల తన చివరి పాట రాశారు. ఆ పాటను కొంతసేపటి క్రితం వదిలారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. సంగీతం .. సాహిత్యం .. ఆలాపన సమపాళ్లలో కుదిరిన పాట ఇది. సందర్భంలో అందంగా ఒదిగిపోయిన పాట ఇది.
ఈ మధ్య కాలంలో నాని చేసిన సినిమాల్లో థియేటర్ కి వచ్చిన సినిమా ఇదే. అందువలన ఆయన ఈ సినిమాపై గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. అందుకు తగినట్టుగానే ఫస్టు వీక్ వసూళ్లు ఉండటంతో ఆయన హ్యాపీగా ఉన్నట్టుగా చెబుతున్నారు. సాయిపల్లవి .. కృతి శెట్టి పాత్రలు ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి.