'రాధే శ్యామ్' నుంచి రెడీ అవుతున్న మరో సాంగ్!
- పాన్ ఇండియా మూవీగా 'రాధే శ్యామ్'
- రికార్డుస్థాయి వ్యూస్ ను రాబట్టిన ట్రైలర్
- సంగీత దర్శకుడిగా జస్టిన్ ప్రభాకరన్
- జనవరి 14వ తేదీన విడుదల
ఈ సినిమా నుంచి వదలడానికి మరో సాంగ్ ను రెడీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక బ్యూటిఫుల్ మెలోడీ అని అంటున్నారు. న్యూ ఇయర్ కానుకగా ఈ పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. విస్మయులను చేసే విజువల్స్ తో ఈ పాటను చిత్రీకరించారని అంటున్నారు.
మరోపక్క, ఒమిక్రాన్ కారణంగా ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇంతవరకూ జనవరి 14వ తేదీతో కూడిన పోస్టర్లతోనే అప్ డేట్స్ వస్తున్నాయి. హీరోయిన్ ప్రేమ కోసం హీరో ఎలాంటి అడ్వెంచర్స్ చేశాడనేదే ఈ కథ. కృష్ణంరాజు - భాగ్యశ్రీ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.
.