మెగా మూవీలో కీర్తి సురేశ్ జోడీగా చైతూ?
- రిలీజ్ కి రెడీగా 'థ్యాంక్యూ'
- షూటింగు పూర్తిచేసుకున్న 'బంగార్రాజు'
- లైన్లో రెండు ప్రాజెక్టులు
- 'భోళా శంకర్'లో చేసే ఛాన్స్
ఇక కీర్తి సురేశ్ జోడీగా నాగశౌర్య అయితే బాగుంటాడని భావించి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇంతకుముందు 'మహానటి' సినిమాలో ఏఎన్నార్ పాత్రలో కీర్తి సురేశ్ కాంబినేషన్లో చైతూ ఒక సీన్ లో చేశాడు. ఆయన అయితే తాము అనుకున్న పాత్రకి పెర్ఫెక్ట్ గా సరిపోతాడని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.
త్వరలో విక్రమ్ కుమార్ మూవీ 'థ్యాంక్యూ'ను థియేటర్లకు తీసుకు రానున్న ఆయన, రీసెంట్ గా 'బంగార్రాజు' షూటింగును కూడా పూర్తి చేశాడు. ఇక మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందువలన ఆయన ఒప్పుకుంటాడో లేదో చూడాలి. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకునే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు.