ట్రైలర్ తోనే కొత్త రికార్డు సెట్ చేసిన ప్రభాస్!
- రొమాంటిక్ లవ్ స్టోరీగా 'రాధేశ్యామ్'
- ప్రభాస్ జోడిగా పూజ హెగ్డే
- మొన్ననే వదిలిన ట్రైలర్
- జనవరి 14న సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేదిక ద్వారానే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. నాయకా నాయికల మధ్య ప్రేమ .. ఆ మధ్యలో చోటు చేసుకునే కొన్ని అనూహ్యమైన సంఘటనలను టచ్ చేస్తూ వదిలిన ఈ ట్రైలర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది.
24 గంటల్లో ఈ ట్రైలర్ 64 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను సంపాదించుకోవడం ఒక రికార్డుగా చెబుతున్నారు. ప్రభాస్ కి గల క్రేజ్ కీ .. ఈ సినిమా పట్ల జనంలో ఉన్న ఆసక్తికి ఇది ఒక నిదర్శనమని అంటున్నారు. ప్రభాస్ తన ఇమేజ్ కి భిన్నంగా క్లాస్ గా కనిపిస్తూ చేసిన ఈ లవ్ స్టోరీకి ఈ స్థాయి రెస్పాన్స్ వస్తుండటం విశేషంగా చెప్పుకుంటున్నారు.