'గని' రిలీజ్ డేట్ ఖరారు!
- 'గని'గా వరుణ్ తేజ్
- బాక్సింగ్ నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా సయీ మంజ్రేకర్ పరిచయం
- మార్చి 18వ తేదీన విడుదల
తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. మార్చి 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు కొంతసేపటి క్రితమే ప్రకటించారు. రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నాయికగా సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. జగపతిబాబు ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు.
ఇక ముఖ్యమైన పాత్రల్లో సునీల్ శెట్టి .. ఉపేంద్ర .. నవీన్ చంద్ర .. నదియా నటించారు. తమన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. మొదట్లో డిసెంబర్ 3న రిలీజ్ చేద్దామనుకున్న ఈ సినిమా ఈ నెల 24వ తేదీకి వాయిదా పడింది. ఆ తరువాత మళ్లీ ఆ నిర్ణయాన్ని మార్చుకుని ఇప్పుడు మార్చి 18వ తేదీన ఫిక్స్ చేశారు.
.