పులివెందులకు మంచి కంపెనీ వస్తోంది.. 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయి: సీఎం జగన్
- కడప జిల్లాలో సీఎం జగన్ రెండోరోజు పర్యటన
- పులివెందులలో ఆదిత్య బిర్లా టెక్స్ టైల్ పరిశ్రమకు శంకుస్థాపన
- ఆదిత్య బిర్లా కంపెనీ ఫార్చ్యూన్-500లో ఒకటని వెల్లడి
- పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న సీఎం
పులివెందులలో ఆదిత్య బిర్లా కంపెనీ ఏర్పాటు ద్వారా తొలిదశలో 2 వేలకు పైగా ఉద్యోగాలు వస్తాయని అన్నారు. పులివెందుల ప్రజలకు అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబడులు పెడుతున్న పారిశ్రామికవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు సీఎం చెప్పారు. అంతకుముందు సీఎం జగన్ వైఎస్సార్ ఘాట్ వద్ద తండ్రికి ఘననివాళులు అర్పించారు.