జోరు చూపుతున్న కేరళ బ్యూటీ!
- మలయాళ సినిమాల్లో మంచి క్రేజ్
- తమిళ .. కన్నడలోను ఇమేజ్
- తెలుగు తెరపై సందడికి రెడీ
- ధనుశ్ 'సార్' సినిమాలోను ఛాన్స్
మలయాళ సినిమా 'పాప్ కార్న్' తో తన కెరియర్ ను మొదలుపెట్టిన సంయుక్త, ఆ వెంటనే 'కలరి' అనే సినిమాతో కోలీవుడ్ లో కాలు పెట్టేసింది. పనిలో పనిగా కన్నడలో 'గాలిపట' చేసిన ఈ సుందరి, టాలీవుడ్ కి తన గ్లామర్ సత్తా ఏమిటో చెప్పాలనే గట్టి పట్టుదలతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది.
తెలుగులో ఈ బ్యూటీ చేసిన 'భీమ్లా నాయక్' .. 'బింబిసార' విడుదలకి సిద్ధంగానే ఉన్నాయి. ఈ సినిమాల తరువాత సంయుక్త జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని అనుకునేలోగానే మరో ఛాన్స్ కొట్టేసింది. తెలుగు .. తమిళ భాషల్లో ధనుశ్ నటిస్తున్న 'సార్' సినిమా కోసం ఎంపికైంది. ఇక ఈ కేరళ కుట్టీ దూకుడు మొదలైపోయిందనే అనుకోవాలేమో!