రెండు కాళ్లు లేని కుక్కను మళ్లీ నడిచేలా చేసిన యువకుడు.. వీడియో ఇదిగో
- యువకుడి సృజనాత్మకకు నెటిజన్లు ఫిదా
- చిన్నారులు ఆడుకునే సైకిల్ వెనుకభాగంతో యువకుడి ప్రయోగం
- దాన్ని కుక్క వెనుక కాళ్ల భాగంలో తగ్గించిన యువకుడు
- పాలస్తీనాలోని గాజా సిటీలో ఘటన
చిన్నారులు ఆడుకునే సైకిల్ వెనుక భాగాన్ని కుక్కకు కట్టి ఆ జంతువు మళ్లీ నడిచేలా చేశాడు. ఆ కుక్క పేరు లూసీ అని పక్షవాతంతో దాని వెనుక కాళ్లు రెండూ పనిచేయడం లేదని ఆ యువకుడు చెప్పాడు. లూసీనీ అతడు తిరిగి నడిచేలా చేసిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఆలోచన అద్భుతమని జంతు ప్రేమికులు అభినందిస్తున్నారు.