Priyadarshi: హిట్ మూవీ రీమేక్ లేనట్టేనా?

Nayattu remake movie update

  • మలయాళ హిట్ మూవీగా 'నాయట్టు'
  • తెలుగు రీమేక్ కి సన్నాహాలు
  • ఇటీవల జరిగిన పూజా కార్యక్రమాలు
  • డీల్ చెడటంతో ఆగిపోయిన ప్రాజెక్టు  

ఈ మధ్య కాలంలో తెలుగులోకి మలయాళ సినిమాలు ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. అలా 'నాయట్టు' సినిమా కూడా రీమేక్ అవుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. మలయాళంలో చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా, అక్కడ భారీ లాభాలను మూటగట్టుకుంది.

దాంతో ఈ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రియదర్శి .. అంజలి ప్రధాన పాత్రలుగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. రావు రమేశ్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నట్టు చెప్పుకున్నారు. కానీ ఈ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని అంటున్నారు.

గీతా ఆర్ట్స్ వారికీ ..  మలయాళ నిర్మాతలకి మధ్య డీల్ కుదరకపోవడమే ఇందుకు కారణమని చెప్పుకుంటున్నారు. ఈ రీమేక్ బాధ్యతలను 'పలాస' దర్శకుడికి అప్పగించారు. ఆయన కూడా ఇప్పుడు వేరే ప్రాజెక్టు కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాడట. ఇక గీతా ఆర్ట్స్ వారు మాత్రం ఈ ప్రాజెక్టును చేసే ఆలోచనలో లేరనేది స్పష్టం అని అంటున్నారు.

  • Loading...

More Telugu News