'భీమ్లా నాయక్' నుంచి రానా స్పెషల్ వీడియో!
- 'భీమ్లా నాయక్'గా పవన్
- డేనియల్ శేఖర్ గా రానా
- దర్శకుడిగా సాగర్ కె చంద్ర
- సంక్రాంతికి విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియోను వదిలారు. ఈ రోజున రానా పుట్టినరోజు కావడంతో, ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఆవేశంతో పవన్ పై రానా విరుచుకుపడే డైలాగ్ తో కూడిన వీడియోను వదిలారు. రానా పాత్ర ఎంత ఫోర్స్ గా ఉంటుందనేది ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది.
పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ .. రానా జోడీగా సంయుక్త మీనన్ నటించిన ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. కొత్త ఏడాదిలో వస్తున్న ఈ సినిమా కోసం అంతా కూడా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇక డేనియల్ శేఖర్ పాత్రలో రానా ఏ స్థాయిలో విజృంభిస్తాడో చూడాలి.