జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం వస్తుంది: వెంకీ కుడుముల
- చిరంజీవి 156వ చిత్రం ప్రకటన
- దర్శకుడిగా వెంకీ కుడుముల
- ఆనందంతో పొంగిపోతున్న వెంకీ
- గతంలో ఛలో, భీష్మ చిత్రాలు చేసిన యువ దర్శకుడు
దీనిపై వెంకీ కుడుముల ఏమంటున్నాడంటే... "జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశాలు వస్తాయి. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థాంక్యూ చిరంజీవి సర్. మీపై నాకున్న అభిమానం, నాపై మీరు చూపుతున్న నమ్మకం ఈ చిత్రాన్ని నా సర్వశక్తులు ధారపోసి తెరకెక్కించేలా నన్ను నడిపిస్తాయని నమ్ముతున్నాను. నా కల సాకారం అయ్యేలా చేసిన డీవీవీ మూవీస్ కు, డాక్టర్ మాధవి రాజు గారికి కృతజ్ఞతలు" అంటూ ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని వెలిబుచ్చారు.