వెంకీ కుడుముల డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం
- స్పీడ్ పెంచిన మెగాస్టార్
- ఈ నెలలో 4 చిత్రాల షూటింగ్ లో పాల్గొంటున్న చిరు
- తాజాగా 156వ చిత్రం ప్రకటన
- ఛలో, భీష్మ చిత్రాలతో నిరూపించుకున్న వెంకీ
'ఛలో' చిత్రంతో యూత్ ను విశేషంగా ఆకట్టుకున్న వెంకీ కుడుముల, ఆ తర్వాత 'భీష్మ'తో కమర్షియల్ సినిమాలు తీసే సత్తా ఉందని చాటుకున్నాడు. తాజాగా మెగాస్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. త్వరలోనే తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.