కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన నయనతార
- 'ది లిప్ బామ్ కంపెనీ' పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసిన నయన్
- చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్ తో కలిసి కొత్త బిజినెస్
- నయన్ తో దశాబ్ద కాలంగా పరిచయం ఉందన్న రేణిత
ఈ సందర్భంగా రేణిత మాట్లాడుతూ, నయన్ తో తనకు దశాబ్ద కాలంగా పరిచయం ఉందని చెప్పారు. ఆమెపై తనకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే ఇద్దరం ఈ వ్యాపారంలో భాగస్వాములమయ్యామని తెలిపారు. ఈ కంపెనీకి సంబంధించి గత కొన్నేళ్లుగా తమ మధ్య చర్చలు జరిగాయని... అయితే కరోనా వల్ల కంపెనీని లాంచ్ చేయడం ఆలస్యమయిందని చెప్పారు.