దుమ్మురేపుతున్న 'అఖండ'.. తొలి వారం కలెక్షన్లు ఎంతంటే..!
- ఘన విజయం సాధించిన బాలయ్య, బోయపాటి హ్యాట్రిక్ మూవీ
- తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్ల షేర్
- ప్రపంచ వ్యాప్తంగా రూ. 87.90 కోట్ల గ్రాస్ వసూలు
'అఖండ'కు భారీ స్థాయిలో రూ . 53 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రం తొలి ఏడు రోజుల్లో మంచి బిజినెస్ చేసింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రూ. 44.11 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.82 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 4.56 కోట్లు వసూలు చేసింది.
ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ. 53.49 కోట్ల షేర్, రూ. 87.90 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరో రూ. 51 లక్షలు వస్తే ఈ సినిమా హిట్ చిత్రంగా నిలుస్తుంది. అంతేకాదు మరో రూ. 12 కోట్ల గ్రాస్ సాధిస్తే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరుతుంది. ఈ వారం వచ్చే కలెక్షన్లతో బాలయ్య 'అఖండ' రూ. 100 కోట్ల మార్క్ ను క్రాస్ చేయబోతోంది.