వీడియో కాల్ చేసి మాట్లాడిన గంటకే సాయితేజ మృతి.. విషాదంలో కుటుంబం
- హెలికాప్టర్ ప్రమాదంలో రావత్‌తో పాటు మృతి
- అంతకుముందే కుమార్తెను చూడాలంటూ వీడియో కాల్
- కుటుంబంతో సంతోషంగా మాట్లాడిన సాయితేజ్
- ఆ తర్వాత కాసేపటికే ప్రమాదం
- విషాదంలో మదనపల్లె
గ్రామానికి చెందిన బి.సాయితేజ కూడా ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. బిపిన్ రావత్‌కు వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా చేరిన తర్వాత సాయితేజ ఢిల్లీలోనే ఉంటున్నారు. ఏడాది క్రితమే ఆయన తన కుటుంబాన్ని మదనపల్లెకు మార్చారు. కాగా, నిన్న ప్రమాదం జరగడానికి ముందు సాయితేజ ఉదయం 8.15 గంటలకు భార్య శ్యామలకు వీడియో కాల్ చేశారు. కుమార్తె దర్శినిని చూడాలని ఉందని భార్యకు చెప్పారు. అనంతరం అందరితో మాట్లాడిన ఆయన ఆ తర్వాత కాసేపటికే హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలిసి మదనపల్లెలో విషాద ఛాయలు నెలకొన్నాయి.