'స్కైలాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టుగా నాని!
- వినోదమే ప్రధానంగా 'స్కైలాబ్'
- గ్రామీణ నేపథ్యంలోని కథ
- రేపు జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- డిసెంబర్ 4వ తేదీన విడుదల
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రేపు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా నాని రానున్నాడు. 'అలా మొదలైంది' సినిమా నుంచి కూడా నిత్యా మీనన్ - నాని మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే నాని ఈ వేడుకకు వస్తున్నాడని అంటున్నారు.
ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, రాహుల్ రామకృష్ణ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథ, ఆస్తులు .. అంతస్తులు కాదు అనుబంధాలు శాశ్వతం అనే సందేశాన్ని ఇచ్చేదిగా సాగుతుంది.
కొంత గ్యాప్ తరువాత నిత్యా మీనన్ చేసిన ఈ సినిమా ఆమెకి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.
.