కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసిన వైద్యులు
- కరోనా బారిన పడిన కమలహాసన్
- చెన్నైలో శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్స
- కమల్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
కమలహాసన్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. కమలహాసన్ శ్రీరామచంద్ర మెడికల్ సెంటర్ లో చేరారని బులెటిన్ లో తెలిపారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. తాజా బులెటిన్ లో వివరాలను చూసి ఆయన అభిమానులు ఊరట చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో రావాలని ఆకాంక్షిస్తున్నారు.