నటుడు కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఏపీ సీఎం జగన్
- నటుడు కైకాల సత్యనారాయణకు తీవ్ర అనారోగ్యం
- హైదరాబాదు అపోలో ఆసుపత్రిలో చికిత్స
- కైకాల ఆరోగ్యంపై ఆరా తీసిన సీఎం జగన్
- త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ నటుడు కైకాల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కైకాల ఆరోగ్య పరిస్థితిని, చికిత్స తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. కైకాల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, కైకాల ఆరోగ్యంపై వదంతులు రావడంతో ఆయన కుటుంబ సభ్యులు ఖండించడం తెలిసిందే.