అమరావతి శ్మశానం మాటకు కట్టుబడి ఉన్నా: మంత్రి బొత్స సత్యనారాయణ
- అమరావతి రైతులకు పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్నాం
- వారి మనసులో ఉన్నట్టు చేయడం కుదరదు
- రాజధాని నుంచే పాలించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఉందా? అని ప్రశ్న
అమరావతి రైతులకు పరిహారం ఇస్తున్నామని, ప్లాట్లు అభివృద్ధి చేసి ఇస్తామని చెప్పామని, అంతేకానీ వారి మనసులో ఉన్నట్టు ప్రభుత్వం చేయాలంటే కుదరదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నుంచి తమ నేత వచ్చినప్పుడు ఒకమాట.. వెళ్లాక మరోమాట మాట్లాడుతున్నారంటూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాజధాని ప్రాంతం నుంచే పాలించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందేమో వారే చెప్పాలన్నారు. మూడు రాజధానులను చేసి చూపెడతామని స్పష్టం చేశారు.