అసెంబ్లీలో జరిగిన ఘటన దురదృష్టకరం: కల్యాణ్ రామ్
- అసెంబ్లీ ఒక దేవాలయం వంటిది
- మహిళలను గౌరవించడం సంప్రదాయం
- రాజకీయ నేతలు హుందాగా నడుచుకోవాలి
సాటి వ్యక్తిని, ముఖ్యంగా మహిళలను గౌరవించడం మన సంప్రదాయమని... అలాంటిది అసెంబ్లీలో మహిళలను అకారణంగా దూషించే పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ హుందాగా నడుచుకోవాలని కోరుతున్నానని చెప్పారు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దైవత్వం ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. పూజ్యులు రామారావుగారు మహిళలకు ఇచ్చిన గౌరవాన్ని అందరం ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పారు.