ఎన్టీఆర్ సినిమా షూటింగు మొదలెట్టేస్తున్న కొరటాల!
- రిలీజ్ కి రెడీగా 'ఆచార్య'
- ఫిబ్రవరి 4వ తేదీన విడుదల
- ఎన్టీఆర్ సినిమాకి సన్నాహాలు
- జనవరి తరువాత షూటింగుకి ఎన్టీఆర్
'ఆచార్య' సినిమా ప్రమోషన్స్ పూర్తి స్థాయిలో జనవరి నుంచి మొదలవుతాయి గనుక, ఈ లోగా ఎన్టీఆర్ సినిమాను మొదలుపెట్టడానికి కొరటాల రెడీ అవుతున్నాడని అంటున్నారు. అయితే ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమాతో వచ్చే నెలంతా బిజీగా ఉంటాడు. అందువలన కొరటాల సినిమా షూటింగులో ఆయన పాల్గొనడు.
ఈ కారణంగా ఎన్టీఆర్ కాంబినేషన్లో లేని సన్నివేశాలను చిత్రీకరించడానికి కొరటాల సన్నాహాలు చేసుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. డిసెంబర్ లో కొంత షూటింగు కానిచ్చేసి, 'ఆచార్య' షూటింగు తరువాత మళ్లీ మొదలుపెడతారట. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణతో కూడా కొరటాల ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.