నటుడు సూర్య క్షమాపణలు చెప్పాల్సిన పనిలేదు.. ఆ డిమాండ్ అర్థరహితం: కాట్రగడ్డ ప్రసాద్
- ‘వన్నియార్’ వర్గాన్ని అవమానించేలా సినిమాలోని సీన్లు ఉన్నాయన్న రాందాస్
- క్షమాపణలు చెప్పాలని డిమాండ్
- వివాదం ముగిసిందన్న కాట్రగడ్డ ప్రసాద్
- సినిమాలు, రాజకీయాలు వేర్వేరన్న సంగతిని గుర్తు పెట్టుకోవాలని సూచన
వన్నియార్ సంఘం అభ్యంతరాలపై స్పందించిన సూర్య ఆ లోగోను తొలగించారని, దీంతో ఈ వివాదం ముగిసిందని అన్నారు. అయినప్పటికీ సూర్య నుంచి క్షమాపణలు డిమాండ్ చేయడం అర్థరహితమన్నారు. రాందాస్ తమ డిమాండ్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. సూర్య సినిమాల విషయంలో రాజకీయాలు వద్దని, పేదలు, గిరిజనులకు సూర్య ఎంతో చేశారని అన్నారు. రాజకీయాలు, సినిమాలు వేర్వేరన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని ప్రసాద్ సూచించారు.