అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 25 నుంచి 'దృశ్యం 2'
- 'దృశ్యం' సినిమాకి సీక్వెల్ గా 'దృశ్యం 2'
- దర్శకుడిగా జీతూ జోసెఫ్
- నిన్నరాత్రి జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్
- హిట్ ఖాయమన్న బృందం
ఇప్పుడు అదే నటీనటులతో 'దృశ్యం 2' సినిమాను రూపొందించారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వెంకటేశ్ .. మీనా .. నరేశ్ .. సంపత్ రాజు .. శ్రీప్రియలతో పాటు, దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.'దృశ్యం' సినిమాకి మించి ఈ సినిమా ఆసక్తిని పెంచుతుందనీ, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.